నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాల కల్పనే లక్ష్యంగా ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తాజాగా భారీ జాబ్ మేళాను (Mega Job Mela) ప్రకటించారు. ఈ నెల 29న ఖమ్మంలో ఈ భారీ జాబ్ మేళాను నిర్వహించనున్నారు. ఈ మేరకు పొంగులేటి కార్యాలయం నుంచి ప్రకటన విడుదలైంది. ఈ జాబ్ మేళాలో 100కు పైగా ప్రముఖ కంపెనీలు పాల్గొనున్నాయి. ఈ జాబ్ మేళాలలో ఇంటర్వ్యూలు నిర్వహించి దాదాపు 10 వేల మందికి ఉద్యోగావకాశాలను కల్పించనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు.
విద్యార్హతలు: ఈ జాబ్ మేళాలో అన్ని రకాలు విద్యార్హతలు కలిగిన వారికి ఉద్యోగావకాశాలు కల్పించనున్నారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, బీఫార్మసీ, ఎంఫార్మసీ, హోటల్ మేనేజ్మెంట్, డ్రైవర్లు, బీటెక్, ఎంటెక్ తో పాటు.. బీఏ, బీఎస్సీ, బీకామ్, ఎంబీఏ, ఎంసీఏ, పీజీ విద్యార్హత కలిగిన వారు ఈ జాబ్ మేళాకు హాజరుకావాలని ప్రకటనలో పేర్కొన్నారు. ట్రాన్స్ జెండర్లు, చెవిటి, మూగ, దివ్యాంగులకు కూడా అవకాశాలు ఉన్నాయి.
ఇతర వివరాలు: – అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా ఈ లింక్ (https://seenannasainyam.com/home_page?fbclid=IwAR2NqfTJDwY46Takp7zNsG0_qx2VnlmtZ5HLVxUKvw5uATpeiQbybqnNcKg) ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ప్రకటనలో పేర్కొన్నారు.









