AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

త్వరలో ఎంపీ సీట్లు పెరుగుతాయి.. ప్రధాని మోదీ

కొత్త పార్లమెంట్ వేదికగా ప్రధానిలు మోదీ కీలక వ్యాఖ్య
న్యూఢిల్లీ: ఇది ప్రజాస్వామ్యానికి కొత్త దేవాలయం అని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. నూతన పార్లమెంట్ భవనాన్ని ఆదివారం ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. 75 ఏళ్ల తరువాత కొత్త పార్లమెంట్‌ను నిర్మించుకున్నామన్నారు. పవిత్రమైన సెంగోల్‌ను పార్లమెంట్‌లో ప్రతిష్టించుకున్నామని, భారత్ అభివృద్ధి చెందితే ప్రపంచం కూడా అభివృద్ధి చెందుతుందన్నారు. కొత్త పార్లమెంట్… కొత్త భారత్‌కు కొత్త జోష్ తీసుకొచ్చిందని ప్రశంసించారు.

ఈ రోజు చరిత్రలో నిలిచిపోతుందని, 140 కోట్ల భారతీయుల కల సాకారమైందని, అధునిక భారత్‌కు కొత్త పార్లమెంట్ అద్దం పడుతుందని మోడీ కొనియాడారు. ఆత్మనిర్భర్ భారత్‌కు పార్లమెంట్ సాక్షంగా నిలుస్తుందని ప్రశంసించారు. ప్రజాస్వామ్యానికి భారత్ తల్లి లాంటిదన్నారు. అమృత్ కాల్‌లో అన్ని కఠిన సవాళ్లను అధిగమిస్తామని, ప్రజల ఆశలు, ఆకాంక్షలను కొత్త పార్లమెంట్ గౌరవిస్తుందన్నారు. కొత్త పార్లమెంట్ జాతీయ చిహ్నాలను ప్రతిబింభిస్తుందన్నారు. పాత పార్లమెంట్‌లో ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యేవని మోడీ పేర్కొన్నారు. రానున్న రోజుల్లో ఎంపిల సంఖ్య పెరిగే అవకాశం ఉందని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పార్లమెంట్‌ను నిర్మించామని, తొమ్మిదేళ్ల బిజెపి పాలనలో ఎన్నో విజయాలు సాధించామని, ఇతర దేశాలతో భారత్ సాగించిన ప్రయాణం ఆదర్శంగా నిలుస్తుందని మోడీ ప్రశంసించారు.

రానున్న కాలంలో ఎంపీల సంఖ్య పెరుగుతుందని మోదీ చెప్పారు. పాత పార్లమెంటు భవనంలో అనేక ఇబ్బందులు ఉండేవని, సభ్యులు కూర్చోవడానికే కాకుండా, సాంకేతిక సమస్యలు కూడా ఉండేవని చెప్పారు. రాబోయే కాలంలో ఎంపీల సంఖ్య పెరుగుతుందని, అందుకు తగినట్లుగానే నూతన పార్లమెంటు భవనాన్ని నిర్మించామని చెప్పారు. కొత్త భవనంలో ఆధునిక వసతులు ఉన్నాయని చెప్పారు. ప్రస్తుత పార్లమెంట్ కు 1272 మంది సభ్యులు కూర్చునే విధంగా నిర్మించామని వెల్లడించారు. పాత పార్లమెంట్ భవనంలో కూర్చోవడానికే కాకుండా సాకేంతికంగానూ ఇబ్బంది ఉండేదని మోడీ చెప్పారు. ఇది కేవలం భవనం మాత్రమే కాదని 140 కోట్ల భారతీయుల ఆకాంక్షకు ప్రతీక అని అభిప్రాయపడ్డారు. అధునిక భారత్ కు కొత్త పార్లమెంట్ అద్దం పడుతోందని చెప్పారు. పవిత్రమైన సెంగోల్ ను పార్లమెంట్ లో ప్రతిష్టించామని మోడీ చెప్పారు. సేవ కర్తవ్యానికి సెంగోల్ ప్రతీక అని వెల్లడించారు. చోళ సామ్రాజ్య చరిత్రలో సెంగోల్ కు ప్రత్యేకమైన స్థానం ఉందని వెల్లడించారు.

ANN TOP 10