రూ. 2 వేల నోట్ల మార్పిడి పై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన చేసింది. నోట్ల మార్పిడికి ప్రజలు ఎవరూ కూడా ఐడెంటిటీ ప్రూఫ్ చూపించాల్సిన పని లేదని తెలిపింది. అంతేకాకుండా రిక్వెస్ట్ ఫామ్ నింపాల్సిన పనిలేదని క్లారిటీ ఇచ్చింది. అర్బీఐ వెల్లడించిన రూల్స్ ప్రకారం ఒకే విడతలో గరిష్టంగా రూ. 20 వేల వరకు నోట్లను మార్చుకోవచ్చునని తెలిపింది.
రూ. 2 వేల నోట్లను ఉపసంహరించుకుంటూ ఇటీవల ఆర్బీఐ నిర్ణయం తీసుకున్న వేళ… బ్యాంకుల్లో నోట్ల మార్పిడి చేసుకోవాలంటే ఖాతాదారులు ఆధార్ కార్డ్ వంటి గుర్తింపు పత్రాలతో పాటుగా ఒక ఫారమ్‌ను సమర్పించాలని సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అవుతున్న నేపథ్యంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ ప్రకటన చేసింది.









