AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

యాదాద్రికి పోటెత్తిన భక్తులు..

సండే కావడంతో రాష్ట్రంలోని ప్రధాన ఆలయాలకు భక్తులు పోటెత్తారు. యాదాద్రి, వేములవాడ రాజన్న ఆలయాలకు తెల్లవారు జాము నుంచే భక్తులు క్యూ కట్టారు.
యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామి ఆలయానికి ఉదయం నుంచే భక్తులు క్యూ లైన్లో నిల్చున్నారు. వేసవి సెలవులు ఆదివారం కావడంతో ఉదయం నుండి క్యూ కాంప్లెక్స్ లో భక్తులు గంటల తరబడి వేచి ఉన్నారు. ప్రత్యేక దర్శనానికి రెండు గంటలు, ఉచిత దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతుంది.

కోడె మొక్కుల కోసం క్యూ

వేములవాడ రాజన్న సన్నిధిలో భక్తుల రద్దీ భారీగా ఉంది. ఆదివారం కావడంతో వేలాదిగా భక్తులు తరలివచ్చారు. — కోడె మొక్కుల కోసం బారులు తీరారు. – స్వామి వారి దర్శనం కోసం 4 గంటల సమయం పడుతోంది.

ANN TOP 10