AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మిగ్ 21 ఎయిర్ క్రాఫ్ట్​ల సేవలు తాత్కాలికంగా బంద్

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐఏఎఫ్) 50 మిగ్ 21 ఫైటర్​ ఎయిర్ క్రాఫ్ట్ ల సేవలను తాత్కాలికంగా నిలిపివేసింది. మొత్తం 50 మిగ్​ యుద్ధ విమానాలను పక్కకు పెట్టింది. ఈనెల 8న రాజస్థాన్ లోని హనుమాన్​గఢ్​​లో ఓ మిగ్​ విమానం కూలిపోయి ముగ్గురు చనిపోయారు. దీంతో ఆ యుద్ధ విమానాల పనితీరుపై మరోసారి సందేహాలు రేకెత్తాయి. ఈ నేప థ్యంలో అన్ని మిగ్ యుద్ధ విమానాలను ఐఏఎఫ్​ టెక్నికల్ తనిఖీల కోసం పంపింద ని అధికారిక వర్గాలు తెలిపాయి.

‘ప్రస్తు తం ఆ విమానాలన్నింటికీ టెక్నికల్ పరీక్ష లు నిర్వహిస్తున్నారు. విధుల నిర్వహణకు ఫిట్ అని తేలిన తర్వాత సంబంధిత నిపు ణుల టీం క్లియరెన్స్ ఇచ్చాకే వాటిని అను మతిస్తం’ అని ఆ వర్గాలు పేర్కొన్నాయి. కాగా, 1960లో మిగ్ యుద్ధ విమానాలను ఐఏఎఫ్​లో ఇండక్ట్ చేశారు. మొదటిసారిగా మిగ్ ఫైటర్​ను చేర్చాక ఐఏఎఫ్​ 870 మిగ్ 21 ఫైటర్లను తయారు చేసింది. అయితే, ఈ విమానాల పనితీరు నాసిర కంగా ఉందని విమర్శలు వస్తున్నాయి.

ANN TOP 10