తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో సహ నిందితుడిగా ఉన్న ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మరోసారి సీబీఐ విచారణకు డుమ్మా కొట్టారు. శుక్రవారం పక్కాగా విచారణకు రావాల్సిందేనని నోటీసులివ్వడంతో నిన్ననే పులివెందుల నుంచి హైదరాబాద్ బయల్దేరి వచ్చారు.
అయితే ఇవాళ ఉదయం 11 గంటల వరకూ అదిగో వస్తున్నారు.. ఇదిగో వస్తున్నారన్న సమాచారంతో ఎంపీ కోసం సీబీఐ అధికారులు (CBI Officers) వేచి చూశారు. అయితే విచారణకు బయల్దేరినట్లే బయల్దేరి హుటాహుటిన ఆయన పులివెందులకు రూటు మార్చారు. అవినాష్ తల్లి శ్రీలక్ష్మి (Avinash Mother) అనారోగ్యంతో పులివెందులలోని ఆస్పత్రిలో చేర్పించారని ఇంటి నుంచి ఎంపీకి సమాచారం వచ్చింది. దీంతో సీబీఐ విచారణకు బయల్దేరిన ఆయన మార్గమధ్యలోనే పులివెందులకు తన కాన్వాయ్‌ను మళ్లించాల్సి వచ్చిందని అనుచరులు చెబుతున్నారు.









