AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఇళ్ల స్థలాల కోసం జర్నలిస్టుల ధర్నా

హైదరాబాద్‌: అర్హత ఉన్న జర్నలిస్టులు అందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, హైదరాబాద్‌లోని హౌసింగు సొసైటీలకు వారి ఆధీనంలో ఉన్న భూములను వారికే ఇవ్వాలని, ఏ సొసైటీలో మెంబర్షిప్‌ లేని జర్నలిస్టులకు ప్రత్యేక విధానం ద్వారా స్థలాలు కేటాయించాలని డిమాండ్‌ చేస్తూ టీడబ్ల్యూజేఎఫ్‌ ఆధ్వర్యంలో ఇందిరాపార్క్‌ ధర్నా చౌక్‌ వద్ద మహాధర్నా ప్రారంభమైంది. ఈ ధర్నాలో జిల్లా కేంద్రాలు, నియోజక వర్గాలు, మండల స్థాయి జర్నలిస్టులకూ హౌజ్‌ సైట్స్‌ ఇవ్వాలని, జర్నలిస్టుల సమస్యలను సర్కారు సానుభూతితో అర్థం చేసుకుని పరిష్కరించాలని నినాదాలు చేశారు. ఈ ధర్నాకు మద్దతుగా తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, వైఎస్సార్‌టీపీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల తదితరులు హాజరుకానున్నట్లు టీడబ్ల్యూజేఎఫ్‌ యాక్టింగ్‌ ప్రెసిడెంట్‌ రాంచందర్‌, ప్రధాన కార్యదర్శి బసవ పున్నయ్యలు తెలిపారు.

ANN TOP 10