AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఢిల్లీలో కీలక పరిణామం.. ఖర్గేతో రాహుల్ గాంధీ…

న్యూఢిల్లీ: కర్ణాటక తదుపరి సీఎం పంచాయతీ కీలక దశకు చేరుకుంది. మంగళవారమే సీఎం ఎంపికను పూర్తి చేయాలని భావిస్తున్న కాంగ్రెస్ అధిష్ఠానం కసరత్తును వేగవంతం చేసింది. ఈ మేరకు పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahun gandhi) కూడా రంగంలోకి దిగారు. ఢిల్లీలో ఏఐసీసీ (AICC) అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun kharge) నివాసంలో కీలక సమావేశానికి రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ హాజరయ్యారు. సీఎం ఎంపికకు సంబంధించిన కీలకాంశాలపై చర్చించనున్నారు.

ఇద్దరిలో ఎవరిని ఎంపిక చేస్తే బావుంటుంది?. ఎవరిని ఎంపిక చేస్తే ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి?. ఇద్దరినీ నొప్పించకుండా ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి? అనే కీలకాంశాలపై చర్చించనున్నారని తెలుస్తోంది. మరోవైపు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంఎల్‌సీ కూడా ఢిల్లీ చేరుకున్నట్టు జాతీయ మీడియా రిపోర్టులు పేర్కొంటున్నాయి.

ANN TOP 10