AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఢిల్లీలో పాఠశాలకు బాంబు బెదిరింపు

దేశ రాజధాని ఢిల్లీలోని ఓ పాఠశాలకు బాంబు బెదిరింపు వచ్చింది. సమాచారం అందుకున్న ఢిల్లీ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని తనిఖీలు నిర్వహిస్తున్నారు. గతంలోని పలు పాఠశాలలకు బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. ఢిల్లీలోని సాకేత్‌ పుష్ప విహార్‌లోని అమృత పబ్లిక్ స్కూల్‌లో మంగళవారం ఉదయం 6:45 గంటల సమయంలో పాఠశాలకు గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఈ మెయిల్‌ వచ్చింది. ఇందులో పాఠశాలలో బాంబు పెట్టినట్లుగా ఉంది.

దాంతో వెంటనే అప్రమత్తమైన పాఠశాల సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. తర్వాత పాఠశాలకు చేరుకొని తనిఖీలు చేపట్టారు. అయితే, తనిఖీల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కనిపించలేదని పేర్కొన్నారు. అయితే, ఈ మేయిల్‌ ఎక్కడి నుంచి వచ్చిందనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నట్లు చెప్పారు. గతంలో డీపీఎస్‌ మధుర రహదారిలోని పాఠశాలకు రెండుసార్లు బాంబు బెదిరింపు వచ్చింది. పాఠశాలకు బాంబు బెదిరింపు రావడంతో ఆ సమయంలో పాఠశాల వద్ద గందరగోళ పరిస్థితి నెలకొన్నది.

ANN TOP 10