AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రంగారెడ్డిజిల్లాలో రోడ్డు ప్రమాదం: నలుగురు మృతి

రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్‌లో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. సిమెంట్ లోడ్ లారీ డిసిఎంను ఢీకొట్టడంతో నలుగురు ఘటనా స్థలంలోనే చనిపోయారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

సిమెంట్‌ లోడ్‌తో వెళ్తున్న లారీ.. వేగంగా వచ్చి డీసీఎం వాహనాన్ని వెనుక నుంచి ఢీకొట్టింది. డీసీఎంలో ప్రయాణిస్తున్న నలుగురు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. అయితే మృతుల వివరాలు ఇంకా తెలియరాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు స్పాట్‌కు చేరుకున్నారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

ANN TOP 10