AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఎమ్మెల్యేలతో సిద్ధరామయ్య రహస్య సమావేశాలు..?

కర్ణాటక అసెంబ్లీ (Karnataka Assembly) ఎన్నికల ఫలితాలతో కన్నడ నాట రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ (Congress) భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. మొత్తం 224 స్థానాలకు గానూ ఏకంగా 135 సీట్లను గెలుచుకుంది. దీంతో ఇప్పుడు తదుపరి ముఖ్యమంత్రి (CM) ఎంపికపై హైకమాండ్‌ కసరత్తులు చేస్తోంది. కన్నడనాట పార్టీ గెలుపులో కీలక పాత్ర పోషించిన మాజీ సీఎం సిద్ధరామయ్య (Siddaramaiah), కేపీసీసీ చీఫ్ డీకే శివ‌కుమార్ (DK Shivakumar) ఇప్పుడు సీఎం పదవికి పోటీ పడుతున్నారు.

ఈ నేపథ్యంలో తదుపరి సీఎం ఎవరన్నదానిపై ప్రస్తుతం ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో సీఎం పదవి కోసం మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వేగంగా పాములు కదుపుతున్నారు. తనకే సీఎం పదవి దక్కేలా మద్దతు గల ఎమ్మెల్యేలతో రహస్య సమావేశాలకు తెరలేపినట్లు తెలుస్తోంది. బెంగళూరులోని ఓ భవనంలో తనకు మద్దతుగా నిలుస్తున్న ఎమ్మెల్యేలతో సిద్దు భేటీ నిర్వహించినట్లు సమాచారం. ఈ భేటీకి ఎమ్మెల్యేలు ఎంబీ పాటిల్‌, జమీర్‌ అహ్మద్‌ ఖాన్‌, ఉత్తర కర్ణాటకకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నట్లు టాక్‌ వినిపిస్తోంది.

కాగా, కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమం గురువారం నిర్వహించనున్నట్లు విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. అదే రోజు కేబినెట్‌ మంత్రులు కూడా ప్రమాణం చేయనున్నట్లు వారు వెల్లడించారు. మరోవైపు కొత్త సీఎంకు శుభాకాంక్షలు అంటూ డీకే, సిద్ధు నివాసాల ముందు వారి మద్దతుదారులు బ్యానర్లు, పోస్టర్లు ఏర్పాటు చేశారు.

ANN TOP 10