AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఈ రోజు సాయంత్రమే బొమ్మై రాజీనామా!..

కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఖాయమని తేలిన నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఈ రోజు సాయంత్రమే తన పదవికి రాజీనామా చేయనున్నారని తెలుస్తోంది. కాగా కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగుతున్నప్పటికీ ముఖ్యమంత్రి విషయంలో ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత లేదు. రేపు (ఆదివారం) కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశం నిర్వహించే అవకాశాలున్నాయి. కాగా సీఎం పదవి కోసం ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్, సీనియర్ నేత, మాజీ సీఎం సిద్ధరామయ్య మధ్య పోటీ నెలకొనే అవకాశాలున్నాయి.

కర్ణాటకలో కాంగ్రెస్ విజయం ఖాయమైన నేపథ్యంలో రాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి ఎవరు? అనే ఆసక్తికర చర్చపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. సీఎంగా ఎవరికి బాధ్యతలు అప్పగించాలనే విషయాన్ని కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నిర్ణయిస్తారని ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు.

ANN TOP 10