ప్రస్తుతం రూ.10లక్షలు ఇస్తాం: రేవంత్‌రెడ్డి
ఆస్కార్ విన్నర్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ కు రూ.10 లక్షల నగదు ఇస్తామని, అధికారంలోకి రాగానే రూ.కోటి ఇస్తామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రకటించారు. బోయిన్ పల్లిలో జరిగిన రాజీవ్ గాంధీ ఆన్ లైన్ క్విజ్ కాంపిటేషన్ ప్రోగ్రామ్ ప్రారంభానికి రాహుల్ సిప్లి గంజ్ చీఫ్ గెస్ట్ గా వచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి.. ఈ ప్రోగ్రాం ప్రారంభానికి రాహుల్ వచ్చాడని.. జూన్ 2న జరిగే క్విజ్ ప్రోగ్రాంకి బహుమతులివ్వడానికి ప్రియాంక గాంధీ వస్తారని అన్నారు. ఆ రోజు రాహుల్ సిప్లి గంజ్ కు పెద్ద ఎత్తున సన్మానం చేస్తామని చెప్పారు. 10 లక్షల నగదు బహుమానం ఇస్తామని చెప్పారు.
పేద కుటుంబం నుంచి ఆస్కార్ స్థాయికి వెళ్లిన రాహుల్ ను రాష్ట్ర ప్రభుత్వం సన్మానిస్తదనుకున్నా కానీ నిరాశపరిచిందన్నారు రేవంత్. రాహుల్ కు కాంగ్రెస్ పార్టీ తరపున 10 లక్షల నగదు బహుమానం ఇస్తామని చెప్పారు. కొత్త సంవత్సరం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని.. అపుడు కోటి రూపాయల నగదు ఇస్తామని చెప్పారు. ఆర్టిస్టులను సన్మానించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.









