AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

జూనియర్ పంచాయతీ కార్యదర్శి ఆత్మహత్య

వరంగల్ జిల్లా ఖానాపురం మండలంలోని రంగాపురం గ్రామ జూనియర్ పంచాయతీ కార్యదర్శిగా పనిచేసే బైరు సోనీ(29) శుక్రవారం గ్రామపంచాయతీ కార్యాలయంలోనే పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడగా… చికిత్స నిమిత్తం నర్సంపేటలోని ఓ ప్రభుత్వ ద‌వాఖాన‌కు తీసుకువెళ్లగా చికిత్స పొందుతూ మృతిచెందింది.

సమాచారం తెలుసుకున్న నర్సంపేట శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి, ఖానాపురం ఎంపీపీ వేములపల్లి ప్రకాశరావుతో పాటు తోటి జూనియర్ పంచాయతీ కార్యదర్శులు, సీనియర్ పంచాయతీ కార్యదర్శులు ఆస్పత్రి వద్దకు వెళ్లి మృతదేహాన్ని సందర్శించి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శి బైరుసోని ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

ANN TOP 10