AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

భార్యను నరికి… తలను పడేసిన కానిస్టేబుల్

రంగారెడ్డి జిల్లా ఎల్ బి నగర్ ప్రాంతం వనస్థలిపురంలోని గౌతమి నగర్ లో దారుణం చోటుచేసుకుంది. కానిస్టేబుల్ కుంచపు రాజ్ కుమార్ తన భార్యను హత్య చేశాడు. భార్య శోభ మెడను భర్త కత్తితో కోసి తలను మొదటి అంతస్తు నుంచి కింద పడేశాడు. హైకోర్ట్ లో 4వ గేట్ వద్ద కానిస్టేబుల్ విధులు నిర్వహిస్తున్నాడు. అక్రమ సంబందం కారణంగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. ఎల్ బి నగర్ డిసిపి సాయి శ్రీ తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ANN TOP 10