AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

టెన్త్ విద్యార్థులకు మంత్రి హరీశ్ గుడ్ న్యూస్

సిద్దిపేట జిల్లాలో ప్రతిభ కనబరిచిన వారికి నగదు ప్రోత్సాహకం
పది ఫలితాల్లో సిద్దిపేట జిల్లా రెండో స్థానంలో నిలవటం పట్ల మంత్రి హరీశ్ హర్షం వ్యక్తం చేశారు. జిల్లాలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకం ప్రకటించారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ.. ఎవరైతే 10/10 జీపీఏ సాధించారో వారికి రూ.10 వేలు నగదు ప్రోత్సాహకం అందజేయనున్నట్లు వెల్లడించారు.

అలాగే 100 పర్సంట్ రిజల్ట్ సాధించిన ప్రభుత్వ పాఠశాలలకు రూ.25 వేలు నగదు పురస్కారాన్ని ప్రకటించారు. ఈ విద్యా సంవత్సరం ప్రారంభంలో ఈ నగదును సదరు పాఠశాలలకు ఇవ్వనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఈసారి జిల్లా వ్యాప్తంగా 126 మంది విద్యార్థులు 10/10 జీపీఏ సాధించగా.. జిల్లా వ్యాప్తంగా 219 ప్రభుత్వ పాఠశాలలు వందకు వదం శాతం ఉత్తీర్ణత సాధించాయి. దీంతో ఆ విద్యార్థులకు పాఠశాలలకు మంత్రి నగదు ప్రోత్సాహకాలు ఇవ్వనున్నారు.

ANN TOP 10