AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

అంత్యక్రియలకు డబ్బులు లేక దారుణం..

డెడ్ బాడీ కేసులో విస్తుపోయే విషయాలు
హైదరాబాద్‌లోని లంగర్‌హౌస్‌లో రోడ్డు పక్కన గోనె సంచుల్లో మృతదేహాం లభ్యమైన ఘటనలో ట్విస్ట్. గోనె సంచిలోని మృతదేహాం అశోక్‌దిగా పోలీసులు గుర్తించారు. మృతి చెందిన సోదరుడికి అంత్యక్రియలు నిర్వహించడానికి డబ్బులు లేక అన్నాచెల్లెలు బాడీని ముక్కలు ముక్కలుగా నరికి లంగర్‌‌హౌస్ దర్గా దగ్గర రోడ్డు పక్కన పడేసినట్లు పోలీసులు గుర్తించారు. దివ్యాంగుడైన అశోక్ మద్యానికి బాగా బానిసై చనిపోయినట్లు పోలీసుల విచారణలో తేలింది.

అన్నాచెల్లెలు ఆటోలో వచ్చి మృతదేహాన్ని రోడ్డు పక్కన పడేసి వెళ్లిపోయినట్లు సీటీ ఫుటేజీ ద్వారా పోలీసులు గుర్తించారు. ఈ కేసులో కాళీమందిర్ ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎల్ కాలనీకి చెందిన రాజు, స్వరూపలను పోలీసులు అరెస్ట్ చేశారు. అంత్యక్రియలు నిర్వహించడానికి తమ దగ్గర డబ్బులు లేవని, అందుకే ఇలా చేసినట్లు నిందితులిద్దరూ చెబుతున్నారు. అయితే నిందితులు చెప్పే విషయం నిజమేనా? లేదా? అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. ఈ కేసులో పోలీసులు మరింత లోతుగా విచారణ చేపడుతున్నారు.

అన్న మెరుగుపల్లి రాజు, తమ్ముడు అశోక్, చెల్లి స్వరూప కాళీ మందిర్ ఎన్ఎస్ఎల్ కాలనీలో నివాసం ఉంటున్నారు. అశోక్ మద్యానికి బానిస అయ్యాడు. దీంతో ఆరోగ్యం పూర్తిగా దెబ్బ తినడంతో అన్న రాజు, చెల్లి స్వరూప ఇద్దరూ కలిసి సోదరుడికి గతంలో డాన్ బాస్కో హాస్పిటల్‌లో ట్రీట్మెంట్ చేయించారు. అయినా కూడా అశోక్ బ్రతికే ఛాన్స్ లేదని, ఇంటికి తీసుకువెళ్లాలంటూ వైద్యులు సూచించారు. దీంతో రాజు, స్వరూప తన సోదరుడు అశోక్‌ని ఇంటికి తీసుకువెళ్లారు. అనంతరం గురువారం అశోక్ ఇంట్లో మృతి చెందాడు. అతని దహన సంస్కారానికి డబ్బులు లేక గురువారం అర్ధరాత్రి సమయంలో మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేసి గోనెసంచులో పెట్టి ఆటోలో తీసుకువచ్చి లంగర్‌హౌస్‌లో ఉన్న దర్గా వద్ద పడేశారు. రాజు, స్వరూప పై 302,201 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

ANN TOP 10