AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

పశువులా మాట్లాడకు తలసాని: సునీతారావు

హైదరాబాద్: మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌పై కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు సునీతారావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రియాంకా గాంధీ (Priyanka gandhi), కాంగ్రెస్ అధ్యక్షుడిపై మంత్రి తలసాని (Telangana Minister) చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పశుసంవర్ధక శాఖ అయితే మాత్రం.. పశువులా మాట్లాడకు తలసాని అంటూ వ్యాఖ్యలు చేశారు.

తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏ పార్టీ నుంచి వచ్చారు .. టీడీపీ పార్టీలో ఆయన ఎం చేశారో అందరికి తెలుసన్నారు. రాబోయే రోజుల్లో ఎవరి దమ్ము ఎంతో తెలుస్తుందన్నారు. అందరు దోచుకోవడంలో బిజీగా ఉన్నారని ఆరోపించారు. శ్రీకాంతా చారి చనిపోవడానికి కారణం తలసాని శ్రీనివాస్ కదా అని ప్రశ్నించారు. కేసీఆర్ సీఎం కుర్చీలో ఉన్నారు అంటే అది మా భిక్ష అని అణ్నారు. దానం నాగేంద్ర చేసిన అరాచకాలు అంతా ఇంత కాదన్నారు. ప్రియంకా గాంధీ , రేవంత్ అడిగిన వాటికి సమాధానం చెప్పాలని సునీత రావు డిమాండ్ చేశారు.

ANN TOP 10