AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బోధన్ ఎమ్మెల్యే కారు ఢీకొని బాలుడు మృతి

నిజామాబాద్ జిల్లా బోధన్ ఎమ్మెల్యే కారు ఢీకొని ఓ బాలుడు మృతిచెందాడు. షకీల్ సతీమణి అయేషా ఫాతిమా ప్రయాణిస్తున్న కారు ఢీకొన్న ఘటనలో తీవ్రగాయాల గాయాల పాలై చికిత్స పొందుతున్న బాలుడు దీపక్ తేజ మృతి చెందాడు.పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ తరలిస్తుండగా మార్గ మద్యంలో ప్రాణాలు కోల్పోయాడు.

ఆదివారం సాయంకాలం ఎమ్మెల్యే భార్య, అనుచరులు ప్రయాణిస్తున్న కారు బోధన్ పట్టణంలోని మర్రి మైసమ్మ వద్ద గల రాయల్ గార్డెన్ సమీపంలో అజయ్ అలియాస్ దీపక్ అనే బాలుడిని ఢీకొట్టింది.దీపక్ కు మెదడుకు తీవ్ర గాయాలు కావడంతో వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. అయితే పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ తరలిస్తుండగా దీపక్ తేజ్ ప్రాణాలు కోల్పోయాడు.బోధన్ పట్టణానికి చెందిన ఒడ్డన్న, రాధా దంపతుల ఏకైక కుమారుడు దీపక్. వారికి వివాహమైన 14 సంవత్సరాలకు దీపక్ జన్మించాడు. ఒక్కడే కొడుకు కావడం దీపక్ ను తల్లిదండ్రులు అల్లారుముద్దుగా చూసుకున్నారు. ఒడ్డెన్న కొన్ని సంవత్సరాలు దుబాయిలో పని చేసి వచ్చి ప్రస్తుతం ఓ బార్ షాపులో వెయిటర్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో ఎమ్మెల్యే సతీమణి కారు ఢీకొని దీపక్ చనిపోవడంతో.. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

ANN TOP 10