పెద్దల అనుమతి లేకుండా తమ అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకున్నాడని యువతి కుటుంబ సభ్యులు యువకుడి ఇంటిపై దాడికి పాల్పడ్డారు.ఈ సంఘటన ఖమ్మం జిల్లా ఏనుకూరు మండలంలో చోటు చేసుకుంది.
గార్లఒడ్డు గ్రామంకు చెందిన ముదిగొండ ఉమావెంకట్ ఠాగూర్ ఆటో ట్రావెల్స్ నడుపుతూ జీవిస్తున్నాడు.అదే గ్రామానికి చెందిన యువతితో అతనికి పరిచయం ఏర్పడింది.అది కాస్తా ప్రేమగా మారింది.ఈ విషయం యువతి ఇంట్లో తెలిసింది.ఇద్దరి కులాల ఒక్కటే అయినప్పటికీ.. అమ్మాయి కుటుంబసభ్యులు పెళ్లికి అంగీకించలేదు. దీంతో ప్రేమజంట నెల రోజులు క్రితం గ్రామం వదిలి వెళ్లి ఓ దేవాలయంలో పెళ్లి చేసుకున్నారు.పెళ్లి ఫోటోలు ఆధారంగా ఈ నెల 6న వైరాలో రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్టర్ చేసుకున్నారు.అంతేకాకుంగా ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అమ్మాయి కుటుంబ సభ్యులకు విషయం తెలిసింది.దీంతో వారు ఆగ్రహం చెంది అబ్బాయి ఇంటిపై,కూల్ డ్రింక్స్ షాపుపై దాడి చేసి ధ్వంసం చేశారు.ఈ దాడిలో తీవ్ర ఆస్థినష్టం వాటిల్లిందని బాధిత కుటుంబం వాపోయింది.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.









