AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఐఏఎస్, ఐపీఎస్ వర్సెస్ హెచ్ఎండీఏ

రంగారెడ్డి జిల్లా పుప్పాల్ గూడలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు, HMDA అధికారులకు మధ్య వివాదం చెలరేగింది. ల్యాంకో హిల్స్ సమీపంలో 100 ఫీట్ల లింక్ రోడ్డు నిర్మాణం పనులు చేస్తున్న HMDA అధికారులను సివిల్ సర్వీసెస్ అధికారులు అడ్డుకున్నారు. 2007 సంవత్సరంలో సర్వే నెంబర్ 454లోని 57 ఎకరాల స్థలంను ఆదర్శ్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీకి కేటాయించింది అప్పటి ప్రభుత్వం.తమకు కేటాయించిన స్థలంలో రోడ్డు నిర్మాణ పనులు చేస్తున్నారని IAS, IPS అధికారులు అంటున్నారు. అయితే మాస్టర్ ప్లాన్ ప్రకారం వంద ఫీట్ల రోడ్డు నిర్మాణాల పనులు చేస్తున్నామని HMDA వారు స్పష్టం చేశారు. ససేమిరా రోడ్డు వేయవద్దని IAS, IPS అధికారుల పట్టుబడుతుంటే.. రోడ్డు వేసి తీరుతామని HMDA ఈఈ విజయ్ కుమార్ స్పష్టం చేశారు. విషయం తెలుసుకున్న నార్సింగి పోలీసులు అక్కడ చేరుకుని పరిస్థితిని పర్యవేక్షించారు.

ANN TOP 10