AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

క్రికెట్ ఆడుతుండగా గుండెపోటు..

సాఫ్ట్‌వేర్ ఉద్యోగి హఠాన్మరణం
గుండెపోటుకు గురై యువకులు మృతి చెందుతున్న ఘటనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మహేశ్వరంలో గుండెపోటుతో ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి హఠాన్మరణం చెందాడు. బౌలింగ్ వేస్తుండగా వెన్నునొప్పి రావడంతో కారులో విశ్రాంతి తీసుకోవడం కోసం వెళ్లాడు. కారులో కూర్చోని సేద తీరుతుండగా ఒక్కసారిగా గుండెపోటుకు గురై అక్కడిక్కడే మరణించాడు. మణికంఠ మృతితో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

ఏపీలోని ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం మల్లవరం గ్రామానికి చెందిన మర్రిపూడి మణికంఠ(26) హైదరాబాద్‌లో గత కొంతకాలంగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. శనివారం ఆఫీస్‌కు సెలవు కావడంతో స్నేహితులతో కలిసి సరదాగా క్రికెట్ ఆడటం కోసం ఘట్టపల్లి శివారులో ఉన్న కేసీఆర్ క్రికెట్ స్టేడియానికి వెళ్లాడు. అయితే బౌలింగ్ చేస్తుండగా తీవ్ర వెన్నునొప్పి రావడంతో కారులో కూర్చోని రెస్ట్ తీసుకుంటున్నాడు. కొద్దిసేపటి తర్వాత మణికంఠను స్నేహితులు పిలవగా పలకలేదు. దీంతో కారు దగ్గరికి వెళ్లి చూడగా.. పడిపోయి ఉండటంతో వెంటనే దగ్గరలోని ఆస్పత్రికి స్నేహితులు తరలించారు.

ANN TOP 10