AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బీజేపీకి హునుమాన్ చాలీసా గురించి మాట్లాడే అర్హత లేదు: రేవంత్

కర్నాటక ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నాయకులు చేసిన వ్యాఖ్యలను బీజేపీ సీరియస్ గా తీసుకుంది. అధికారంలోకి వస్తే భజరంగ్ ధళ్ ను బ్యాన్ చేస్తామని ప్రకటించడంపై బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ పిలుపుమేరకు తెలంగాణలో నిరసనలు చేపట్టింది. గాంధీభవన్ తో పాటు జిల్లా పార్టీ కార్యాలయాల ముందు ఆ పార్టీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. హనుమాన్ చాలీసా పఠించారు. దీంతో బీజేపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా రాష్ట్రవ్యాప్తంగా హైటెన్షన్ కు దారితీసిన బీజేపీ ఆందోళనలపై టీపీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. సచివాలయంలోని పోచమ్మ ఆలయాన్ని కూల్చేసినప్పుడు మౌనంగా ఉన్న బీజేపీ నేతలకు హనుమాన్ చాలీసా గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. కిషన్ రెడ్డి, లక్ష్మణ్, బీజేపీ నేతలు ఎంఐఎంతో కలిసిపోయారని ఆరోపించారు.కిషన్ రెడ్డి, లక్ష్మణ్ హనుమాన్ చాలీసా చదువుకోవాలని సూచించారు.

ANN TOP 10