AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మరోసారి బుచ్చిబాబుకు నోటీసులు

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ దూకుడు..
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ మరింత దూకుడు పెంచింది. హైదరాబాద్‌కు చెందిన ఆడిటర్ బుచ్చిబాబుకు మరోసారి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఇవాళ విచారణకు రావాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో బుచ్చిబాబు నేడు ఈడీ కార్యాలయానికి వెళ్లారు. గతంలో బుచ్చిబాబును ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీబీఐ అరెస్ట్ చేయగా.. కొన్ని రోజుల పాటు ఆయనను రిమాండ్‌లోకి తీసుకుని ప్రశ్నించింది. ఈ కేసులో ఆయనకు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ స్పెషల్ కోర్టు ఇటీవల బెయిల్ మంజూరు చేసింది.

ఈ క్రమంలో బుచ్చిబాబుకు మరోసారి ఈడీ నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ మూడో ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఈ ఛార్జిషీట్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత భర్త అనిల్ కుమార్ పేరును కూడా ఈడీ ప్రస్తావించింది. నిధుల లావాదేవీలకు సంబంధించి అనిల్ కుమార్ కీలకంగా వ్యవహరించినట్లు అభియోగాలు నమోదు చేసింది. తన బినామీల ద్వారా కవిత లిక్కర్ వ్యాపారం చేశారని, ఆ లాభాల ద్వారా హైదరాబాద్‌లో భూములు కొనుగోలు చేసినట్లు గుర్తించింది. తన బినామీ అయిన అరుణ్ పిళ్లై ద్వారా కవిత హైదరాబాద్‌లో తనకు ఉన్న పలుకుబడిని ఉపయోగించుకుని చాలా తక్కువ ధరకే భూములు కొనుగోలు చేశారని ఈడీ ఛార్జిషీట్‌లో పేర్కొంది. హైదరాబాద్‌లో 3 స్థలాలను కొనుగోలు చేసినట్లు గుర్తించింది.

ANN TOP 10