AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

US News: భారత సంతతికి చెందిన వ్యక్తిపై అమెరికాలో ఫెడరల్ కేసు.. లైంగిక వేధింపుల ఆరోపణలు

అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రంలో నివసిస్తున్న భారత సంతతికి చెందిన ఇంటి యజమాని వెంకటాచలం మణిపై లైంగిక వేధింపుల ఆరోపణలు నమోదయ్యాయి. తన ఇంట్లో అద్దెకు ఉంటున్న మహిళా అద్దెదారిని పలుమార్లు లైంగికంగా వేధించారనే ఫిర్యాదుతో ఆయనపై అమెరికా అధికారులు చర్యలు చేపట్టారు. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.

బాధితురాలు చేసిన ఫిర్యాదు ప్రకారం, వెంకటాచలం మణి తనతో శారీరక సంబంధం పెట్టుకోవాలని పలుమార్లు ఒత్తిడి తెచ్చారని, అనుచితంగా తాకేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. ఈ ఆరోపణలపై విచారణ చేపట్టిన అమెరికా అధికారులు కేసుకు సంబంధించిన వివరాలను పరిశీలించినట్లు సమాచారం.

ఈ ఘటనపై స్పందించిన అమెరికా న్యాయశాఖ పెన్సిల్వేనియా జిల్లా కోర్టులో వెంకటాచలం మణిపై ఫెడరల్ కేసు నమోదు చేసింది. ప్రస్తుతం కేసుకు సంబంధించిన న్యాయపరమైన ప్రక్రియ కొనసాగుతోంది. కోర్టు విచారణ అనంతరం తదుపరి చర్యలు తీసుకోనున్నారు.

ANN TOP 10