పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రాల్లో **’ఓజీ 2’**పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దర్శకుడు సుజీత్ తెరకెక్కించనున్న ఈ సీక్వెల్‌కు సంబంధించిన స్క్రిప్ట్ ఇప్పటికే లాక్ అయినట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. తొలి భాగం విజయాన్ని దృష్టిలో పెట్టుకుని, మరింత యాక్షన్, ఎమోషన్స్, ఆసక్తికరమైన మలుపులతో కథను సిద్ధం చేసినట్లు సమాచారం. దీంతో ఈ ప్రాజెక్ట్‌పై అభిమానుల ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది.
అయితే పవన్ కళ్యాణ్ వ్యక్తిగత, రాజకీయ కార్యక్రమాల కారణంగా ఓజీ 2 షూటింగ్ షెడ్యూల్‌లో మార్పులు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం, వచ్చే ఏడాది సమ్మర్ తర్వాతే సినిమా చిత్రీకరణ ప్రారంభమయ్యే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. ఈ గ్యాప్‌లో దర్శకుడు సుజీత్ తన మరో ప్రాజెక్ట్ **’బ్లడీ రోమియో’**పై పూర్తిగా దృష్టి సారించి, ఓజీ షూటింగ్ మొదలయ్యేలోపు ఆ సినిమాను పూర్తి చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే, పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్‌లో ఓజీ 2 నుంచి అభిమానులకు ప్రత్యేక అప్‌డేట్ ఇవ్వాలని చిత్రబృందం యోచిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. అయితే ఈ విషయాలపై ఇప్పటివరకు చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు. దీంతో ఫ్యాన్స్ అధికారిక అప్‌డేట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.








