AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బీఆర్ఎస్‌కు నీటి పంపిణీపై మాట్లాడే హక్కు లేదు.. మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శలు

ఉమ్మడి పాలమూరు జిల్లా సాగునీటి ప్రాజెక్టులను పదేళ్ల పాలనలో తీవ్రంగా నిర్లక్ష్యం చేసిన బీఆర్ఎస్ నాయకులకు నీటి పంపిణీపై మాట్లాడే నైతిక హక్కు లేదని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శించారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఎల్‌నినో ప్రభావంతో నీటి కొరత నెలకొన్నప్పటికీ, ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ ఆల్మట్టి, జూరాల ప్రాజెక్టుల నుంచి నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ ఆయకట్టుకు తాగు, సాగునీటిని నిరంతరం అందిస్తోందని ఆయన స్పష్టం చేశారు.

ఈ పరిస్థితుల్లో కూడా రాజకీయ లబ్ధి కోసం ముఖ్యమంత్రి సొంత జిల్లాకు ప్రభుత్వం నీళ్లు విడుదల చేయడం లేదంటూ బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమని జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా చౌకబారు రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆయన విమర్శించారు.

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వం కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు ప్రాజెక్టులను ప్రారంభించిందని గుర్తు చేసిన మంత్రి, అనంతరం అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం 4.60 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ఈ ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. కల్వకుర్తి ప్రాజెక్టు కింద 25 టీఎంసీల నీటి సరఫరాకు సంబంధించిన పనులు ఎందుకు పూర్తి చేయలేదో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

ANN TOP 10