మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి, మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు ఏ పార్టీలో చేరతారనే దానిపై స్పష్టత వచ్చింది. ఇన్ని రోజులుగా సస్పెన్ కొనసాగుతున్న ఈ అంశంపై ఎట్టకేలకూ క్లారిటీ ఇచ్చారు ఈ ఇద్దరు నేతలు.ఈ ఇద్దరు కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఖమ్మంలో కాంగ్రెస్ నిర్వహిస్తున్న నిరుద్యోగ నిరసన దీక్షలో ప్రియాంక గాంధీ సమక్షంలో వారు కాంగ్రెస్ పార్టీలో చేరుతారని సమాచారం. పొంగులేటితో పాటు తన అనుచరులు కూడా భారీగా కాంగ్రెస్ లో చేరనున్నట్లు తెలుస్తోంది.









