అందాలతార, అబ్బాయిల కలల రాకుమారి అనుపమ పరమేశ్వరన్ (Anupama parameswaran) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. అందం, అభినయంతో అద్భుతమైన నటనతో అందరి దృష్టిని ఆకట్టుకుంటూ ప్రేక్షకులను మెప్పిస్తున్న ఈ ముద్దుగుమ్మ.. గత కొంత కాలం క్రితం బ్రేకప్ చెప్పుకొని తన కొత్త జీవితాన్ని ప్రారంభించాను అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టిన విషయం తెలిసిందే. అయితే ఆ బ్రేకప్ ఎందుకు జరిగింది అనే విషయంపై తాజాగా స్పందించి, అందరిని ఆశ్చర్యపరిచింది. ఆ యువ హీరోలో ఇంత క్రూరత్వం ఉందా? అంటూ నెటిజన్స్ కూడా ఆశ్చర్యపోతున్నారు. అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
ప్రముఖ హీరోయిన్ అనుపమ గత కొంతకాలంగా ఒక యువ హీరోతో ప్రేమలో ఉందని, ఆ తర్వాత ఇద్దరి మధ్య బ్రేకప్ జరిగింది అంటూ పలు రకాల వార్తలు ప్రచారంలో నిలిచాయి. అయితే ఇప్పటివరకు ఆ వార్తలపై అనుపమ పెద్దగా స్పందించలేదు.కానీ తాజాగా తన గత రిలేషన్ గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇటీవల ఒక ఛానల్ కు ప్రత్యేకంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో అనుపమ మాట్లాడుతూ..” నేను రెండేళ్ల పాటు ఒక టాక్సిక్ రిలేషన్ లో ఉన్నాను. ఒకవేళ ఆ రిలేషన్ నుండి నేను బయటకు రాకపోయి ఉండుంటే అందరూ “#రిప్ అనుపమ” అని సోషల్ మీడియాలో కామెంట్లు చేసే వాళ్ళు.. ఆ బంధంలో నాకు ఎదురైన ప్రతి అనుభవం నరకమే” అంటూ చెప్పుకొచ్చింది.
అనుపమ మాట్లాడుతూ..” నా మాజీ బాయ్ ఫ్రెండ్ రెండేళ్లపాటు తీవ్ర వేధింపులకు గురి చేసాడు. ముఖ్యంగా నేను నార్సిసిస్టిక్ వేధింపులకు గురయ్యాను. నార్సిసిజానికి లింగ బేధం లేదు. ఈ నార్సిసిస్టిక్ అబ్యూజ్ అనే పరిస్థితిని ఎదుర్కొంటూ ఇంకా దానిని గుర్తించని వారి నుంచి నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఇది చాలా అత్యంత ప్రమాదకరమైన కేటగిరి.. వాళ్లు బ్రేకప్ చెప్పుకుంటారు.. తమను పూర్తిగా నాశనం చేసుకోవడానికి కూడా వెనకాడరు. నేను అలాంటి పరిస్థితి నుంచి ఇప్పుడు కోలుకున్నాను…
ఒకరోజు రెమో.. నెక్స్ట్ డే అపరిచితుడు..
నార్సిసిస్టిక్ వేధింపులు అంటే జీవితంలో అపరిచితుడు ఉన్నట్టు.. ఒకరోజు రెమోలా ప్రేమిస్తాడు. ఆ క్షణం అతడి ప్రేమను తట్టుకోలేం.. ఆ ప్రేమను చూసి జీవితంలో ఎంత అదృష్టవంతులం మనం అనే భావన కలుగుతుంది. ఆ భయంకరమైన ప్రేమకు మనసు ఉప్పొంగిపోతుంది. జీవితాంతం ఇలాగే ఉండాలనిపిస్తుంది. మరొకటి రోజు అదే వ్యక్తిలో అపరిచితుడు బయటకొచ్చి క్రూరంగా ప్రవర్తిస్తాడు.ఎవరైనా వచ్చి మిమ్మల్ని పొడిచి చంపుతున్నా.. కనీసం తల కూడా తిప్పకుండా తీవ్రమైన నిర్లక్ష్యం చూపిస్తాడు. మరుసటి రోజు చిన్నపిల్లాడిలాగా ఏడుస్తాడు. ఇంకెప్పుడు ఇలా చెయ్యను అని బ్రతిమలాడతాడు.కానీ మళ్ళీ మామూలే . చెప్పలేనంత ప్రేమను కురిపించడం, మళ్ళీ అపరిచితుడు లాంటి ప్రవర్తనను చూపించడం.. ఈ సైకిల్ రిపీట్ అవుతూనే ఉంటుంది.. ముఖ్యంగా ఈ టాక్సిక్ రిలేషన్ వల్ల డ్రాగన్ మూవీ ప్రమోట్ కూడా చెయ్యనివ్వలేదు..ఈ రిలేషన్ వల్ల చాలా కృంగిపోయాను.. ఇక అలాంటి రిలేషన్ లో ఉండడం కరెక్ట్ కాదని నేను బయటకు వచ్చేసాను” అంటూ అనుపమ చెప్పుకొచ్చింది.
ఇకపోతే తమిళ అగ్ర హీరో విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ తో ఈమె ప్రేమలో ఉన్నట్లు వార్తలు చాలాకాలంగా ప్రచారంలో ఉన్నాయి. అయితే ఇప్పటివరకు వీళ్ళిద్దరూ తమ రిలేషన్ను కన్ఫామ్ చేయలేదు.. అలాగని ఖండించనూ లేదు. ఇప్పుడు అనుపమ బ్రేకప్ స్టోరీ మాత్రం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.








