AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

‘ఆదిపురిష్’ సినిమా టీజర్ రిలీజ్

పాన్ ఇండియా హీరో, రెబల్ స్టార్ ప్రభాస్ శ్రీరాముడి పాత్రలో నటిస్తున్న ‘ఆదిపురుష్’ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాలీవుడ్ డైరక్టర్ ఓం రౌత్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. రెబల్ స్టార్ కథనాయకుడిగా రాబోతున్న ఈ పాన్ ఇండియా చిత్రంపై భారీ అంచనాలున్నాయి. హనుమాన్ జయంతి రోజు సినిమా పోస్టర్ రిలీజ్ చేసిన చిత్ర యూనిట్.. తాజాగా మరో అప్ డేట్ ఇచ్చింది.గతంలో విడుదలైన టీజర్ లో గ్రాఫిక్స్ పై అభిమానులు అసంతృప్తి చెందిన విషయం తెలిసిందే. దీంతో చిత్ర బృందం మరోసారి విజువల్ ఎఫెక్ట్స్ పై దృష్టి సారించింది. తాజాగా వీఎఫ్ ఎక్స్ మార్పులు చేసిన టీజర్ ను చిత్ర బృందం విడుదల చేసింది. కాగా ఈ సినిమాలో కృతి సనన్ సీత పాత్ర చేస్తుండగా.. సైఫ్ అలీ ఖాన్ రావణుడి పాత్ర పోషించారు.ఈ చిత్రం హిందీ, తెలుగుతో పాటు పలు భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా జూన్ 16 విడుదల కానుంది.

వీడియో కోసం

https://twitter.com/i/status/1648894696083828737

ANN TOP 10