AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

అమరావతిని ఆపడం ఎవరితరం కాదు.: సీఎం చంద్రబాబు..

రాష్ట్రానికి ఎటు చూసినా సరైన రాజధాని అమరావతి అని తేల్చిచెప్పారు సీఎం చంద్రబాబు. విజయవాడ లేదా గుంటూరులో 50 ఎకరాలు తీసుకుని సెక్రటేరియట్ కట్టేయొచ్చని, మామూలుగా ఉంటుందన్నారు. భవిష్యత్తును ఆలోచించే ల్యాండ్ పూలింగ్ కాన్సెప్ట్ తీసుకొచ్చానని మనసులోని మాట బయటపెట్టారు. దీన్ని మహానగరం చేయాలని అనిపించిందని చెప్పుకొచ్చారు.

రాజధాని నిర్మాణంలో రైతులను భాగస్వామ్యులను చేస్తే ఎలా ఉంటుందని ఆలోచించామన్నారు. విజయవాడ-గుంటూరు-మంగళగిరి ప్రాంతాలను ఆలోచించినప్పుడు మీరంతా వచ్చారన్నారు. ఆనాడు సైబరాబాద్ నిర్మాణం చేయకుండా ఉంటే.. మీరు భూములు ఇచ్చేవారు కాదని, నా మీద నమ్మకం ఉండేది కాదన్నారు. ఆ సిటీని చూసిన తర్వాత ఇక్కడ కూడా అలాంటి సిటీ నిర్మాణం చేస్తే.. మా జీవితాలు బాగుపడతాయని మీరంతా ముందుకు వచ్చిన భూములు ఇచ్చారని చెప్పారు. దాదాపు రెండు నెలల్లో 29 వేల మంది రైతులు దాదాపు 33 వేల ఎకరాల భూములు ఇచ్చారన్నారు.

ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటిది ఎప్పుడూ జరగలేదన్నారు. అలాంటి వినూత్నమైన స్ఫూర్తికి కారణమైన అమరావతి రైతాంగానికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌లో హైటెక్ సిటీ కట్టారు.. అది మహానగరం అయ్యిందని, హంబుల్‌గా మొదలు పెట్టారంటే బాగుంటుందని రైతులు చెప్పిన మాటలను గుర్తు చేసుకున్నారు. గ్రేట్ విజన్‌కు మొదటి సక్సెస్ మాత్రమేనని అన్నారు. ఆనాడు హైటెక్ సిటీ నిర్మిస్తే.. ఏమి వస్తుందని చాలామంది అన్నారని, ప్రపంచంలో వివిధ కంపెనీల అధినేతలకు షో చేస్తున్నారని దానివల్ల ఏమీ రాదని ఎద్దేవా చేశారన్నారు. తెలుగు జాతి గర్వపడేలా ఒక మహానగరం నిర్మాణం చేయాలని సంకల్పంతో హైటెక్ సిటీ నిర్మాణం చేశామన్నారు.

అమరావతిని ఆపడం ఎవరితరం కాదు

ఇప్పుడు హైదరాబాద్ సిటీని మీరు చూస్తున్నారని అన్నారు. అమరావతి రవాణా వ్యవస్థకు వెన్నెముకగా నిలిచిన సీడ్ యాక్సెడ్ రోడ్డును సీఎం చంద్రబాబు గురువారం ప్రారంభించారు. సీడ్ యాక్సెస్ రోడ్డు పూర్తి కావడంతో దీన్ని ఆపడం ఎవరి తరం కాదని ఒకాయన చెప్పారని వివరించారు. చివరకు చిన్న భూమికి సంబంధించి ఓ రైతు ద్వారా ఆపడానికి వైసీపీ తీవ్ర ప్రయత్నాలు చేసిందన్నారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా మేం జోక్యం చేసుకోమని హైకోర్టు తేల్చి చెప్పిందన్నారు. ఇలాంటి వారివల్ల రాష్ట్రానికి చాలా ప్రమాదమని అన్నారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను అమరావతిలో నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు

ANN TOP 10