AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రేణుకా చౌదరి నివాసంలో కాంగ్రెస్ కీలక సమావేశం

కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరి నివాసంలో కాంగ్రెస్ నేతలు భేటీ అయ్యారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, బలరాం నాయక్, షబ్బీర్ అలీ, అంజన్ కుమార్, గడ్డం ప్రసాద్, సురేష్ షట్కర్ సమావేశం అయ్యారు. ఖమ్మలో జరిగే నిరుద్యోగ నిరసన సభతో పాటు జిల్లా రాజకీయాలపై చర్చిస్తున్నారు. ప్రధానంగా పొంగులేటి చేరికపై డిస్కషన్ కొనసాగింది.పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేలా చొరవ చూపాలని రేణుకా చౌదరిని కోరారు. అదేవిధంగా నిరుద్యోగ నిరసన సభ కొత్త తేదీలను కూడా ప్రకటించారు. రేపు నల్గొండలోని ఎంజీ వర్సిటీలో జరగాల్సిన నిరసన సభ వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.ఈ నెల 28న ఎంజీ వర్సిటీ,24న ఖమ్మం,26న ఆదిలాబాద్‎లో కాంగ్రెస్ సభలు నిర్వహిస్తున్నట్టు ప్రకటించారు.

ANN TOP 10