జమ్ము కశ్మీర్ పూంచ్ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వాహనంలో మంటలు చెలరేగి నలుగురు జవాన్లు మరణించారు. జమ్మూ- పూంచ్ హైవే.. పూంచ్ సెక్టార్ లో జవాన్లు వెళ్తున్న వాహనంలో ఒకసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో నలుగురు జవాన్లు సజీవ దహనం అయ్యారు. నలుగురు జవాన్ల మరణంపై దేశవ్యాప్తంగా సంతాపం ప్రకటిస్తున్నారు.నలుగురు సైనికులు సజీవ దహనంపై ఇండియన్ ఆర్మీ ఉన్నతాధికారులు షాక్ అయ్యారు. ప్రమాదం ఎలా జరిగింది.. ఎందుకు జరిగింది.. కారణాలు ఏంటీ అనే విషయాలపై విచారణకు ఆదేశించారు. ఈ ఘటనపై ఉన్నతాధికారుల బృందం ఘటనాస్థలానికి వెళ్లి విచారణ చేయాలని కేంద్ర రక్షణ శాఖ ఆదేశించింది.









