AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఈద్గా కు కేటాయించిన అటవీ భూమి రద్దు

అమ్మ న్యూస్‌ ఎఫెక్ట్‌..

నిర్మల్‌ జిల్లాకేంద్ర సమీపంలో ఈద్గా కు కేటాయించిన అటవీ భూమిని రద్దు చేస్తూ కేంద్ర అటవీశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయించడంతో రెండ్రోజుల క్రితమే మంత్రులు మహమూద్‌ అలీ, ఇంద్రకరణ్‌ రెడ్డి అట్టహాసంగా ఈద్గాను ప్రారంభించారు. ఇదిలా ఉంటే.. ఈ నెల 6న ఇది చట్టవిరుద్ధమంటూ అమ్మ న్యూస్‌లో ప్రత్యేక కథనం ప్రసారమైంది. నిర్మల్‌ పట్టణంలో వృత్తి నైపుణ్య శిక్షణా కేంద్రం కోసం కేటాయించిన అటవీ భూమిని చట్ట విరుద్ధంగా ఈద్గా నిర్మాణం కోసం కేటాయించిన బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్‌ చేసింది. అమ్మ న్యూస్‌ కథనానికి స్పందించిన కేంద్ర అటవీ శాఖ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

నిరుద్యోగ యువత భవిష్యత్తు తాకట్టు పెట్టి స్వార్థ రాజకీయాల కోసం ఈద్గా ప్రార్థనల కోసం భూమి కేటాయించడం చట్ట విరుద్ధమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ మండిపడ్డారు. ప్రజా ప్రయోజనాల కోసం కేటాయించిన భూములను ఇతర ప్రయోజనాలకు వినియోగించొద్దని ఆయన హెచ్చరించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాసిన విషయం విదితమే.

 

ANN TOP 10