ఎంపీ కావాలన్న ఉద్దేశంతోనే విశాఖ ఉక్కు విషయంలో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ.. రాష్ట్ర ప్రజలను మభ్యపెడుతున్నారని భాజపా నేత విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపించారు. తిరుమల శ్రీవారిని ఆయన దర్శించుకున్నారు. విశాఖ ఉక్కుపై కుట్ర జరుగుతోందని, కేంద్ర ప్రభుత్వమే విశాఖ ఉక్కును నిలబెట్టగలుగుతుందన్నారు. మరోవైపు, హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న తెలుగు తల్లి విగ్రహాన్ని తొలగించినట్లు.. సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోందన్నారు. తెలుగు తల్లి విగ్రహాన్ని ఓర్చుకొలేని సీఎం కేసీఆర్.. ఆంధ్ర ప్రజలకు ఎలా న్యాయం చేస్తారని ప్రశ్నించారు. ఈ మేరకు తెలుగు ప్రజలకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.









