AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

గులాబీ బాస్ కు షాకిచ్చిన మహారాష్ట్ర పోలీసులు

జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకుంటున్న బీఆర్ఎస్ అధినేత.. స్థానిక పార్టీ ఉన్న టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చారు. అప్పటి నుండి ఆయన జాతీయ రాజకీయాల పట్ల వ్యూహాత్మంగా అడుగులు వేస్తున్నారు. ముందుగా కేసీఆర్ తన బలాన్ని నిరూపించేందుకు.. మహారాష్ట్రలో జాతీయ రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టారు. ఇప్పటికే మహారాష్ట్రలో పలుమార్లు బహిరంగసభ పెట్టి.. అక్కడి ప్రజలకు వరాలు కురిపించారు. అదే జోష్ తో అక్కడ మళ్లీ సభ పెట్టాలనుకున్న కేసీఆర్ కు.. పోలీసులు షాకిచ్చారు.

ఈ నెల 24వ తేదీన మహారాష్ట్రలో బహిరంగ సభ నిర్వహించాలని గులాబీ బాస్ నిర్ణయించుకున్నారు. అయితే భద్రతా కారణాల దృష్ట్యా సభకు అనుమతి నిరాకరిస్తున్నట్టు మహారాష్ట్ర పోలీసులు ప్రకటించారు. అంఖాస్‌ మైదానంలో సభకు అనుమతి ఇవ్వలేమని ఔరంగాబాద్‌ పోలీసులు స్పష్టం చేశారు. ఈ సమావేశానికి మరో ప్రదేశాన్ని ఎంచుకోవాలని సూచించారు. ఔరంగాబాద్ పోలీసులపై సీఎం కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు అదే రోజున వేరే ప్రదేశంలో బహిరంగ సభ నిర్వహించడానికి గులాబీ దళం సిద్ధమైంది.

ANN TOP 10