AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నాచారంలో భారీ అగ్నిప్రమాదం..

లీక్ అయిన విషవాయువులు
నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. జేపీ పెయింట్స్ ఘటన మరవకముందే బుధవారం మరో అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో కార్మికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. మల్లాపూర్ పారిశ్రామిక వాడలోని ఏకశిలా రసాయన కంపెనీలో బుధవారం అగ్నిప్రమాదం సంభవించింది.
విషవాయువులు వెలువడటంతో పలువురు కార్మికులు అస్వస్థతకు గురయ్యారు.

మంటలు అలుముకోవడంతో దట్టమైన పొగలు వ్యాపించాయి. పొగలు చుట్టుపక్కల ప్రాంతాలను చీకటిమయం చేశాయి. మంటలు ఎగిసిపడుతుండటంతో స్థానికులు గమనించి ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. ఫైరింజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు. పోలీసులు కూడా అగ్నిప్రమాదం జరిగినట్లు సమాచారం అందుకుని ఘటనా స్థలానికి చేరుకున్నారు. పనిచేసే కార్మికులు అమోనియో విషవాయువు పీల్చుకుని అస్వస్థతకు గురయినట్లు పోలీసులు గుర్తించారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఏంటనేది ఇంకా తెలియరాలేదు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ANN TOP 10