AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఈత కొట్టేందుకు వెళ్లి.. నలుగురి దుర్మరణం

ఈత కొట్టేందుకు వెళ్లిన ముగ్గురు చిన్నారులు, వారిని కాపాడబోయిన తల్లి చెరువులో మునిగి మృత్యువాత పడ్డారు. ఈ విషాదకర సంఘటన నారాయణపేట జిల్లా బోయిన్‌పల్లి గ్రామంలో జరిగింది. గ్రామస్థుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన సురేఖ(25) మేకలు కాసేందుకు చెరువు వైపు వెళ్లింది. ఆమె వెంట కుమారుడు విజయ్‌(11), ఆమె అక్క కూతురు లిఖిత(10)తో పాటు మరో చిన్నారి వెంకటేశ్‌(11) వెళ్లారు.

ఈత కొట్టేందుకని ముగ్గురు పిల్లలు చెరువులోకి దిగగా లోతు ఎక్కువై మునిగిపోయారు. పిల్లలను గమనించి వారిని రక్షించబోయిన సురేఖ కూడా చెరువులో మునిగింది. ఈ విషయాన్ని గమనించిన గ్రామానికి చెందిన మమత అనే ఆమె పరుగున గ్రామంలోకి వెళ్లి విషయం చెప్పింది. గ్రామస్థులు వెంటనే చెరువు దగ్గరకు వెళ్లి గాలింపు చర్యలు చేపట్టగా నలుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నారాయణపేట జిల్లా ఆస్పత్రికి తరలించారు.

ANN TOP 10