వేసవిలో స్పెషల్ ట్రైన్స్, ఈ రూట్లలోనే
రైల్వే ప్రయాణికులకు సౌత్ సెంట్రల్ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని అదనపు ట్రైన్ సర్వీసులు నడపనున్నట్లు వెల్లడించింది. మెుత్తం 62 ట్రిప్పులు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రెల్వేశాఖ అధికారులు తెలిపారు. సికింద్రాబాద్ – దానాపుర్, దానాపుర్ – సికింద్రాబాద్, ఈరోడ్ – నాందేడ్, నాందేడ్ – ఈరోడ్, కోయంబత్తూరు-సంబల్‌పుర్, సంబల్‌పుర్ – కోయబంత్తూరు రూట్లలో ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయని రైల్వే అధికారులు వెల్లడించింది. వేసవిలో స్కూళ్లకు సెలవులు ఉండటంతో పాటు పెళ్లిళ్లు, శుభకార్యాలకు దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులతో రైళ్లలో రద్దీ ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.
ఇక రైల్వే ప్రయాణికుల సౌకర్యార్థం..10 ఎక్స్‌ప్రెస్ రైళ్లకు శాశ్వతంగా ఏసీ అదనపు బోగీలు ఏర్పాటు చేసినట్లు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు స్పష్టం చేశారు. ఈ నెల 24 నుంచి 30 వరకు ఏసీ ట్రైన్లు దశల వారీగా అందుబాటులోకి వస్తాయని చెప్పారు. మచిలీపట్నం – యశ్వంత్‌పుర్ – మచిలీపట్నం (17211/17212) ట్రైన్‌కు సెకండ్ క్లాస్ ఏసీ 1, థర్డ్ క్లాస్ ఏసీ 2 బోగీలు అదనంగా అందుబాటులోకి వస్తాయన్నారు. మచిలీపట్నం – సికింద్రాబాద్ – మచిలీపట్నం (07185/07186) రైలుకు సెకండ్ క్లాస్ ఏసీ-1, థర్డ్ క్లాస్ ఏసీ బోగీలు 2 అమర్చనున్నారు.
మచిలీపట్నం – ధర్మవరం – మచిలీపట్నం (17215/17216) రైలుకు థర్డ్ క్లాస్ ఏసీ బోగీలు 2, హెచ్‌ఎస్ నాందేడ్ – ఈరోడ్ – హెచ్‌ఎస్ నాందేడ్ (07189/07190), హెచ్‌ఎస్ నాందేడ్ -హజ్రత్ నిజాముద్దీన్ – హెచ్‌ఎస్ నాందేడ్ (12753/12754) ట్రైన్లకు థర్డ్ క్లాస్ ఏసీ 1 బోగీ అదనంగా అందుబాటులోకి వస్తాయని రైల్వే అధికారులు వెల్లడించారు.









