విదేశానికి చదువు కోసం వెళ్లిన మరో విద్యా కుసుమం మరణించింది. తెలుగమ్మాయి.. సాయి తేజస్విని సముద్రపు ఒడ్డున ఈత కొడుతుండగా పెద్ద అలలు రావడంతో కొట్టుకు పోయింది. యూకేలోని బ్రైటన్ సముద్రం లో మరణించిన సాయి తేజస్విని వయస్సు ఏళ్లు. కోస్ట్‌గార్డ్‌లు స్పందించి రక్షించే సమయానికి పెద్ద అలలు ఆమెను లోతైన సముద్రంలో లాక్కుపోయాయి. ఒడ్డుకు తీసుకుని వచ్చి సాయి తేజస్వినికి CPR చేసినా స్పందించలేదు. అనంతరం సాయి తేజస్విని చనిపోయినట్లు ప్రకటించారు.
తెలుగు విద్యార్థిని సాయి తేజస్విని మృతదేహాన్నిహైదరాబాద్ తీసుకుని రావడానికి సహాయం చేయాలని ఆమె కుటుంబ సభ్యులు మంత్రి కేటీ రామారావుకు ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కు మంత్రి కేటీఆర్ స్పందించారు. అవసరమైన సహాయం అందిస్తామని సాయి తేజస్విని కుటుంబానికి హామీ ఇచ్చారు.
“మీ కుటుంబానికి జరిగిన నష్టం తీర్చలేనిది.. తన బృందం @KTRoffice వెంటనే సహాయం చేయడానికి స్థానిక బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ బృందం.. హైదరాబాద్‌తో కలిసి పని చేస్తుంది,” అని పేర్కొన్నారు. సాయి తేజస్విని మృత దేహాన్ని ఇక్కడికి తీసుకురావడానికి తమ కుటుంబం చాలా అధికార సవాళ్లను ఎదుర్కొంటోందని సాయి సోదరి ప్రియారెడ్డి చేసిన ట్వీట్‌పై కేటీఆర్ స్పందించారు. “దయచేసి నా ఆత్మ సోదరికి చివరి కర్మలు చేయడానికి మాకు సహాయం చేయండి” అని ఆమె పోస్ట్ చేసింది. యూకేలో క్రాన్‌ఫీల్డ్ యూనివర్శిటీలో ఏరోనాటిక్స్ , స్పేస్ ఇంజినీరింగ్ మాస్టర్స్ చదువుతోంది సాయి తేజస్వి. ఆమె కుటుంబ సభ్యులు చెప్పిన ప్రకారం “ఏప్రిల్ 11 న బ్రైటన్ బీచ్‌లో అలలో చిక్కుకుని మరణించింది. అప్పటి నుండి ఆమె శరీరం UK ఆసుపత్రిలో ఉంది.









