కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి హైకోర్టులో భారీ ఊరట లభించింది. వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డికి కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ నెల 25 వరకు అరెస్ట్ చేయొద్దని ఆదేశాలు జారీ చేసింది. 25 వరకు ప్రతిరోజు విచారణకు హాజరుకావాలని అవినాష్ రెడ్డిని ఆదేశించింది. సీబీఐ విచారణ మొత్తం అవినాష్ రెడ్డి ఆడియో-వీడియో రికార్డు చేయాలని చెప్పింది. సీబీఐ ప్రశ్నలు మొత్తం లిఖిత పూర్వకంగా రాసివ్వాలని కోర్టు ఆదేశించింది. ఈ పిటిషన్ పై 25న తుది తీర్పు ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది.









