AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బీసీల జనగణన జరపాలి.. క్రీమిలేయర్ ఎత్తేయాలి

బీసీలకు ఐఐటి, ఐఐఎంలలో రిజర్వేషన్స్ కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీ ది (Congress Party) అని మాజీ ఎంపీ వి.హనుమంతరావు (Former MP V Hanumanth rao)అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. బీసీల జనగణన జరపాలని .. క్రీమిలేయర్ ఎత్తేయాలని డిమాండ్ చేశారు. మోదీని కలిసి ఎన్నిసార్లు కోరినా ఇంత వరకు స్పందించలేదన్నారు. బడుగు బలహీనర్గాలకు న్యాయం చేయాలనే ఆలోచన గాంధీ కుటుంబంలో ఉందన్నారు. రిజర్వేషన్స్ పెంచాలనే ఆలోచన రాహుల్ గాంధీలో (Rahul Gandhi) ఉందని తెలిపారు. రాహుల్ గాంధీ ఆలోచనను స్వాగతిస్తున్నామన్నారు. పార్టీ క్యాడర్ ఈ అంశాలను గ్రామ గ్రామానికి తీసుకెళ్లాలని సూచించారు. పార్టీ పదవుల్లో బీసీల ప్రాధాన్యత పెరగాల్సిన అవసరం ఉందన్నారు. బీసీలను పార్టీకి దగ్గర చేర్చుకోవాలని.. అప్పుడే పార్టీ అధికారంలోకి వస్తుందని తెలిపారు. హైకోర్టుకు వెళ్ళే దారిలో అంబేడ్కర్ విగ్రహం పెట్టాలని.. దీనిపై కేసీఆర్ (CM KCR), కేటీఆర్ (Minister KTR), అసద్‌ (MIM Leader Asad)కు లేఖ రాసినట్లు చెప్పారు. పాతబస్తీలో అంబేడ్కర్ విగ్రహం పెట్టాల్సి అవసరం ఉందని వీహెచ్ అభిప్రాయపడ్డారు.

ANN TOP 10