AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

పోలీసులకు జక్కంపూడి మాస్ వార్నింగ్..! ఎందుకంటే..?

కర్నూలులో వైకాపా యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెను దుమారం రేపుతున్నాయి. ముఖ్యంగా పోలీసుల తీరుపై ఆయన విరుచుకుపడ్డ విధానం చూస్తుంటే, వైకాపా శ్రేణుల్లో ఉన్న ఆగ్రహం స్పష్టంగా కనిపిస్తోంది.

 

రాజా మాట్లాడుతూ.. ప్రస్తుతం రాష్ట్రంలో రాజ్యాంగం కాకుండా ‘రెడ్ బుక్ రాజ్యాంగం’ నడుస్తోందని ఎద్దేవా చేశారు. టీడీపీ ఏజెంట్లుగా మారి పనిచేస్తున్న ప్రతి పోలీస్ అధికారిపై తాము అధికారంలోకి రాగానే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ‘ఖాకీ చొక్కా వేసుకున్న ప్రతి ఒక్కడూ చట్టానికి లోబడి ఉండాలి.. అంతేకానీ టీడీపీ నేతలకు ఊడిగం చేస్తే మాత్రం ఊరుకోము’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రక్షక భటులే భక్షక భటులుగా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

 

అంబటి రాంబాబు, జోగి రమేష్ వంటి సీనియర్ నేతల ఇళ్లపై పెట్రోల్ బాంబు దాడులు జరిగితే, బాధితులైన వారిపైనే కేసులు పెట్టడం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఇది పక్కా రాజకీయ వేధింపులేనని కొట్టి పారేశారు. అలాగే ఒక మహిళా ఎస్సై పట్ల టీడీపీ నేతలు అమానవీయంగా ప్రవర్తిస్తే కనీసం చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు.

 

ఇక కర్నూలు 3 టౌన్ సీఐ శేషయ్యపై రాజా నేరుగా నిప్పులు చెరిగారు. వైసీపీ కార్యకర్త బాలును అవమానించిన శేషయ్యను రేపు వైసీపీ ప్రభుత్వం రాగానే ఎవరు కాపాడతారని నిలదీశారు. ‘ఈరోజు మంత్రి భరత్ అండ చూసుకుని రెచ్చిపోతున్నావేమో.. రేపు మా ప్రభుత్వం వచ్చాక ఇదే బాలు ఇంటి దగ్గర నువ్వు కాపలా కాయాల్సి ఉంటుంది’ అంటూ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. గతంలో సీఐ శేషయ్య వైకాపా నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశించారని, ఇప్పుడు ప్లేట్ ఫిరాయించి కార్యకర్తలను వేధిస్తున్నారని రాజా మండిపడ్డారు. కష్టపడిన ప్రతి కార్యకర్తకు జగనన్న అండగా ఉంటారని, ఎవరూ అధైర్యపడొద్దని ఆయన భరోసా ఇచ్చారు.

ANN TOP 10