AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

SIR ప్రక్రియపై జగన్ సంచలన వ్యాఖ్యలు..

ఎట్టకేలకు చాన్నాళ్ల తర్వాత మాజీ సీఎం జగన్ మీడియా ముందుకొచ్చారు. ఈసారి ప్రభుత్వంపై కొత్త ఆరోపణలు చేశారు. రాబోయే ఎన్నికల్లో కూటమి ఓటమి ఖాయమని తేల్చేశారు. అందుకోసమే వైసీపీ మద్దతుదారుల ఓట్లను తొలగిస్తున్నారని కాసింత ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

SIR ప్రక్రియపై జగన్ సంచలన వ్యాఖ్యలు

 

దాదాపు రెండువారాల గ్యాప్ తర్వాత వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మీడియా ముందుకొచ్చారు. రాబోయే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఓడిపోతోందంటూ కొత్త పల్లవిని అందుకున్నారు. అందుకు అనుగుణంగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో ఓడిపోతామని తెలిసి ఓటర్ల సమగ్ర సవరణ కార్యక్రమం-సర్ ని తనకు అనుకూలంగా మార్చుకునే అధికార ప్రభుత్వం పడిందని ఆరోపించారు.

 

వైసీపీకి సానుకూలంగా ఉన్న ఓటర్లను తొలగించే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. ఈ విషయంలో సీఎం చంద్రబాబు ఆర్డీవోలతో స్వయంగా మాట్లాడారని కొత్త విషయాలు బయటపెట్టారు. ఎన్యూమరేషన్ ఫామ్‌లు ఇవ్వకుండా BLOలే వాటిని ఫిల్ చేస్తున్నారని మండిపడ్డారు. స్వార్థ రాజకీయాల కోసం పేదవాడి ఓట్లు తొలగిస్తే, వారికి పథకాలు ఎలా వస్తాయంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు రైజ్ చేశారు.

 

ప్రభుత్వంపై రుసరుస, వైసీపీ మద్దతుదారుల ఓట్లు తొలగింపు

 

ఓట్లు తొలగిస్తే వీరు ఏ రాష్ట్రానికి చెందినవారు అవుతారని, చివరకు సిటిజన్ షిప్ లేకుండా చేస్తున్నారంటూ దుయ్యబట్టారు. ఇలా చేయడం ధర్మమేనా? ఓటరు అనేవాడు ఓటరని, చేతనమైతే మంచి చేసి మనసు గెలుచుకోవాలన్నారు. ఓటు వేయరని చెప్పి జాబితా నుంచి పేర్లు తొలగిస్తే ఎలా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

అసలు ఓట్లు తొలగిస్తే నేరుగా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కలవాలని, మీడియా సమావేశం పెట్టి ప్రభుత్వం ఓట్లు తొలగించిందని చెప్పడంపై అధికార పార్టీ నేతలు మండిపడుతున్నారు. వైసీపీ ఎలాగూ ఎన్నికల్లో గెలవదని తెలిసి, ఇప్పటి నుంచి జగన్ స్క్రిప్ట్ రెడీ చేసుకుంటున్నారని అంటున్నారు.

 

చంద్రబాబు అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నారా? ఆయన సీఎంగా తన బాధ్యతలు చేస్తున్నారా? రైతులను గాలికి వదిలేసి, ఆయన చేస్తున్న పాలన ఏంటి? అవినీతి, దోపిడీ, రెడ్ బుక్ నడుస్తోందన్నారు.చంద్రబాబు అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నారా? ఆయన సీఎంగా తన బాధ్యతలు చేస్తున్నారా?

 

రైతులను గాలికి వదిలేసి, ఆయన చేస్తున్న పాలన ఏంటి? అవినీతి, దోపిడీ, రెడ్ బుక్ నడుస్తోందన్నారు. చివరలో మీడియా మిత్రలు వైజాగ్ రాజధాని కథ మావిగన్‌తో ముగిసినట్టేనా? వచ్చే ఎన్నికల నాటికి అమరావతి vs మానిగన్ గా మారుతుందన్నారు. అమరావతికి మద్దతు ఇస్తే టీడీపీకి ఓటు వేయాలని, మానిగన్‌కు మద్దతు ఇస్తే వైఎస్ఆర్‌సీపీకి ఓటు వేయాలన్నారు. మరి విశాఖపట్నం మాటేంటి అంటే చెప్పకుండా వెళ్లిపోయారు. అన్న ప్రశ్నకు బదులు ఇవ్వకుండా ముసిముసిగా నవ్వుతు అక్కడి నుంచి వెళ్లిపోయారు మాజీ సీఎం జగన్.

ANN TOP 10