పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత… ఆ రాష్ట్రంలో రాజకీయ హింస తీవ్రరూపం దాల్చింది. ప్రతిపక్ష టీఎంసీ నాయకులను లక్ష్యంగా చేసుకుని దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా టీఎంసీ మహిళా ఎంపీ మహువా మొయిత్రాపై దాడి జరిగింది. పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తున్న సమయంలో ఓ దుకాణం వద్ద ఆమెపై కొందరు కోడిగుడ్లు విసిరారు. ఈ ఘటనను మహువా స్వయంగా ధృవీకరించారు.
బీజేపీ కార్యకర్తలు ఈ దాడికి పాల్పడినట్లు మహువా ఆరోపించారు. రాష్ట్ర పోలీసుల వైఫల్యమే ఇలాంటి ఘటనలకు కారణమని ఆమె విమర్శించారు. ఇప్పటికే టీఎంసీ ముఖ్య నాయకుడు అభిషేక్ బెనర్జీ, మాజీ మంత్రులపై కూడా దాడులు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై బీజేపీ ఇంకా స్పందించలేదు. బెంగాల్‌లో ప్రతిపక్ష నాయకులపై జరుగుతున్న దాడుల కారణంగా అక్కడి రాజకీయ వాతావరణం ఉద్రిక్తంగా మారుతోంది.








