AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

సంపద సృష్టి లేదు.. సంపెంగ పువ్వూ లేదు.. అంబ‌టి రాంబాబు కీలక వాఖ్యలు..

ప‌థ‌కాల అమ‌లుపై సీఎం చంద్ర‌బాబు నాయుడు చేసిన ప్ర‌క‌ట‌న‌పై వైసీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి అంబ‌టి రాంబాబు ‘ఎక్స్’ (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా ఎద్దేవా చేశారు. “సంపద సృష్టి లేదు.. సంపెంగ పువ్వూ లేదు. జగన్ మీద తోసేసి చంద్ర‌బాబు, లోకేశ్ చేతులు ఎత్తేశారు. హామీలు గాలికి వదిలేశారు. గోవిందా.. గోవిందా!” అని కౌంట‌ర్ ఇచ్చారు.

 

ఇక అప్పుల పేరుతో చంద్ర‌బాబు ప‌థ‌కాలు అమ‌లు చేయ‌డం లేద‌ని అంబ‌టి నిన్న విమ‌ర్శించిన విష‌యం తెలిసిందే. కాగా, ఏపీ ఆర్థిక ప‌రిస్థితి బిహార్ కంటే దిగ‌జారిందంటూ ప‌థ‌కాల అమ‌లుపై చంద్ర‌బాబు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. విశాఖ ఉక్కు, అమ‌రావ‌తి, పోల‌వ‌రం కోసం కేంద్రం ఇచ్చిన నిధుల‌ను మ‌ళ్లించ‌లేమ‌ని వెల్ల‌డించారు.

 

ద‌బ్బులు ఉంటే ప‌థ‌కాల అమ‌లుకు క్ష‌ణం కూదా ఆలోచించ‌న‌ని, ప్ర‌జ‌ల‌కు వాస్త‌వాలు తెలియాల‌నే ఇవ‌న్నీ వెల్ల‌డిస్తున్న‌ట్లు పేర్కొన్నారు. ఆర్థిక ప‌రిస్థితి పుంజుకోగానే త‌ల్లికి వంద‌నం (ఒక్కో విద్యార్థికి రూ.15వేలు), అన్న‌దాత సుఖీభ‌వ (రైతుకు రూ.20వేలు) ప‌థ‌కాలు ఇస్తామ‌ని తెలిపారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10