ఎన్టీవీ చానల్ అధినేత నరేంద్ర చౌదరి ప్రతి ఏటా కార్తీకమాసంలో హైదరాబాద్ లో కోటి దీపోత్సవం కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహిస్తుంటారు. శుక్రవారం కార్తీక పౌర్ణమి కాగా… కోటి దీపోత్సవానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సతీసమేతంగా హాజరయ్యారు.
అమ్మవారి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. స్వయంగా హారతి ఇచ్చారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి దంపతులకు అర్చకులు పట్టువస్త్రాలు బహూకరించారు.