AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

తారక్ బర్త్ డే స్పెషల్.. గాడ్ ఆఫ్ వార్ నుంచి బిగ్ అప్డేట్..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలకు కమిట్ అయ్యి కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఎన్టీఆర్(NTR) ప్రశాంత్ నీల్(Prashanth Neel) దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా డ్రాగన్ అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఈ సినిమాని 2027 జూన్ 11వ తేదీ విడుదల చేయబోతున్నారు. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ దేవర 2 పనులలో బిజీ కాబోతున్నారు. అనంతరం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas) డైరెక్షన్లో మరో సినిమాకు కమిట్ అయిన సంగతి తెలిసిందే.

 

ఎన్టీఆర్ పుట్టినరోజు..

త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ కూడా పూర్తి చేశారని సమాచారం. ఇప్పటికే ఎన్టీఆర్ త్రివిక్రమ్ ప్రాజెక్టు పై సోషల్ మీడియాలో భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఇకపోతే మే 20వ తేదీ ఎన్టీఆర్ తన పుట్టినరోజును జరుపుకుంటున్న నేపథ్యంలో తన సినిమాలకు సంబంధించి వరుస అప్డేట్స్ రాబోతున్నాయని అభిమానులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ త్రివిక్రమ్ ప్రాజెక్టుకు సంబంధించి ఒక కీలక అప్డేట్ రాబోతుందని సమాచారం.

 

ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమాకు గాడ్ ఆఫ్ వార్ టైటిల్..

ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్లో రాబోతున్న సినిమాకు “గాడ్ ఆఫ్ వార్”(God Of War) అనే టైటిల్ ను పరిశీలిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఒక అనౌన్స్మెంట్ వీడియో విడుదల చేయాలనే ఆలోచనలో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఉన్నట్టు తెలుస్తుంది. ఈ అనౌన్స్మెంట్ వీడియో సినిమా కాన్సెప్ట్ లేదంటే ఎన్టీఆర్ లుక్ కు సంబంధించి ఉండబోతుందని సమాచారం. హై విజువల్ ఎఫెక్ట్ హై స్టాండర్డ్ వాల్యూస్ తో ఈ వీడియోని త్రివిక్రమ్ డిజైన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ అనౌన్స్మెంట్ వీడియోకి సంబంధించిన పనులు జరుగుతున్నాయని తెలుస్తుంది.

 

సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కథ నేపథ్యం..

 

ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా త్రివిక్రమ్ ఎన్టీఆర్ సినిమాకు సంబంధించిన అప్డేట్ రాబోతుందనే విషయం తెలిసిన అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ విషయానికి సంబంధించి త్వరలో అధికారక ప్రకటన కూడా రానుంది. ఇక గాడ్ ఆఫ్ వార్ అనే సినిమా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కథ నేపథ్యంలో ఉండబోతుందని గత కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇక ఈ సినిమా గురించి వస్తున్నటువంటి ఈ వార్తలన్నింటికీ మే 20వ తేదీ క్లారిటీ వస్తుందని చెప్పాలి. ఈ సినిమాతో పాటు ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ వీడియో కూడా విడుదల చేయబోతున్నట్టు చిత్రబంధం అధికారకంగా ప్రకటించారు.

ANN TOP 10