AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

టీటీడీ పాలకమండలి తుది జాబితా ఇదే..

తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్, మెంబర్ల పూర్తి జాబితాలు వెల్లడిస్తూ దేవాదాయ శాఖ కార్యదర్శి ఎస్ సత్యనారాయణ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేస్తూ జీఓ ఎంఎస్ నెంబర్ 243 జారీ చేశారు. టీటీడీ మెంబర్లుగా చైర్మన్‌తో కలిపి 25 మందితో బోర్డు ఏర్పాటు చేశారు. వీరితో పాటు నలుగురు ఉన్నతాధికారులను ఎక్స్‌ఆఫీషియో మెంబర్లు‌గా నియమించారు. ఒక స్థానాన్ని పూరించకుండా ప్రభుత్వం ఉంచిన విషయం తెలిసిందే. అయితే ఆస్థానానికి కూడా సభ్యుడిగా ఈరోజు బీజేపీ నేత జి భాను ప్రకాష్ రెడ్డి పేరు ఖరారు చేశారు. పూర్తిస్థాయి టీటీడీ బోర్డును ప్రకటిస్తూ  ఉత్తర్వులు జారీ అయ్యాయి.

జ్యోతుల నెహ్రూ-జగ్గంపేట ఎమ్మెల్యే, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి- కోవూరు ఎమ్మెల్యే, ఎంఎస్‌రాజు-మడకశిర ఎమ్మెల్యే, పనబాక లక్ష్మి-కేంద్ర మాజీ మంత్రి, నన్నూరి నర్సిరెడ్డి-తెలంగాణ, సాంబశివరావు (జాస్తి శివ)-ఎన్‌ఆర్‌ఐ, నన్నపనేని సదాశివరావు-ఫార్మా, సుచిత్రా ఎల్లా-ఫార్మా, కృష్ణమూర్తి-తమిళనాడు కోటేశ్వరరావు-రాజమండ్రి, మల్లెల రాజశేఖర్‌ గౌడ్‌-టీడీపీ, జంగా కృష్ణమూర్తి-టీడీపీ, దర్శన్‌ ఆర్‌ఎన్‌-కాఫీ వ్యాపారి, జస్టిస్‌ హెచ్‌ఎల్‌దత్తు-మాజీ సీజేఐ, పి.రామ్మూర్తి-తమిళనాడు, తమ్మిశెట్టి జానకీదేవి-టీడీపీ, బి.మహేంద్రరెడ్డి-జనసేన, అనుగొల్లు రంగశ్రీ-జనసేన, బి.ఆనంద్‌సాయి-జనసేన కోటా, నరేష్‌ కుమార్‌-కర్ణాటక, శాంతరామ్‌-కుప్పం పారిశ్రామికవేత్త, డా.అదిత్‌ దేశాయ్‌, సౌరబ్‌ హెచ్‌ బోరా-ఆర్థిక నిపుణుడు.

ANN TOP 10