AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బీఆర్‌ఎస్‌ నేత ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ ఇంట్లో విలువైన పత్రాలు చోరీ..

బీఆర్‌ఎస్‌ నేత ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ ఇంట్లో చోరీ జరిగింది. ఆయన స్వస్థలం సిర్పూర్‌ కాగజ్‌నగర్‌లోని ఇంట్లో చోరీ జరిగిందని సోషల్‌ మీడియా వేదికగా తెలిపింది. కోసిని గ్రామంలోని తన ఇంట్లో బుధవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు విలువైన పత్రాలను అపహరించారన్నారు. ఈ సందర్భంగా ఆయన సోషల్‌ మీడియా వేదికగా స్పందించారు. తెలంగాణలో దోపిడీ దొంగల పాలన నడుస్తుందని.. ఇది ముమ్మాటికి నిజమని తెలిపారు. కాగజ్‌నగర్ కోసిని గ్రామంలోని స్వగృహంలో దొంగలు పడ్డారని.. కొన్ని విలువైన డాక్యుమెంట్లు దొచుకోని పోయారన్నారు.

ఇందులో ఉన్న కుట్ర కోణాన్ని కూడా శోధించాల్సిందిగా డీజీపీని కోరుతున్నట్లుగా ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ ‘ఎక్స్‌’లో పోస్ట్‌ పెట్టారు. అయితే, ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ ఎన్నికల సమయంలో ఆ నివాసాన్ని కొనుగోలు చేశారు. ఇక్కడ పర్యటించిన సమయంలో ఇక్కడే నివాసం ఉంటారు. అయితే, బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి తాళాలు, బీరువా తాళాలు పగులగొట్టి విలువైన పత్రాలు ఎత్తుకువెళ్లారు. సంఘటన జరిగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేరు. ఆర్ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

ANN TOP 10